త్రిషకి మూడోసారి ఛాన్స్!

త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. 40 ఏళ్ల వయసులో ఆమెకి హీరోయిన్ గా ఎక్కువ ఛాన్సులు రావడం అంటే మాటలు కాదు కదా. మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఆమె యువరాణిగా కనిపించి అదరగొట్టింది. తన వయసు కన్నా చాలా చిన్నగా అగుపించింది. అందుకే, ఆమెకి ఇప్పుడు ఇంత క్రేజ్.

మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషనే తీసుకోవాలనుకుంటున్నారట. అలా త్రిష మరో బిగ్ ఛాన్స్ పట్టేసింది.

త్రిష ఇంతకుముందు మణిరత్నం తీసిన ‘యువ’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాల్లో నటించింది. ఇది మూడో చిత్రం కానుంది. అలాగే, కమల్ హాసన్ సరసన ఆమె ఇప్పటివరకు రెండు చిత్రాల్లో కనిపించింది. ఒకటి… మన్మథ బాణం. మరోటి… చీకటి రాజ్యం. ఇప్పుడు ఇది మూడో అవకాశం.

ఒకవేళ ఈ సినిమాలో ఆమె నటిస్తే ఆమెకి దర్శకుడితోనూ, హీరోతోనూ హ్యాట్రిక్ అవుతుంది.

 

More

Related Stories