మెయిన్ అట్రాక్షన్ త్రిషనే!

- Advertisement -
Trisha


మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా టీం అంతా దేశమంతా తిరుగుతోంది. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, కార్తీ, విక్రమ్, జయం రవి, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి వంటి భారీ తారాగణం ఉంది. ఐతే ఈ సిటీకి వెళ్లినా, ఎక్కడా ప్రచారం చేసినా కెమెరా కళ్ళు త్రిషపైనే నిలుస్తున్నాయి.

ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్ తో అదరగొడుతోంది. చాలా రోజుల తర్వాత త్రిష బయటికి రావడం ఒక కారణం. ఫైగా, ఇప్పటికీ స్లిమ్ గా ఉంది. చీరలు, డ్రెస్సులు ట్రెండీగా ఉండేలా చూసుకుంటోంది. అందుకే, ఆమె ఫోటోలు, ఆమె హైలెట్ అవుతున్నాయి.

మరోవైపు, ఈ సినిమా తమిళనాడులో, అమెరికాలో ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. కానీ తెలుగునాట ఈ సినిమాకి ఇంకా బజ్ రాలేదు. మణిరత్నం సినిమాలు ఒకప్పుడు బాగా హైప్ క్రియేట్ చేసేవి. కానీ, ఇప్పుడు తెలుగునాట మణిరత్నంకి ఆ క్రేజ్ లేదు. పైగా, పబ్లిసిటీ కూడా తక్కువగా ఉంది.

సినిమా సంగతి ఎలా ఉన్నా త్రిష లైంలైట్ లోకి వచ్చింది.

More

Related Stories