మళ్ళీ ఆమెపైనే ఫోకస్

త్రిష హీరోయిన్ గా ఇప్పటికే రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొంది. 20 ఏళ్ళ తర్వాత కూడా హీరోయిన్ గానే నటించడం అంటే చాలా గ్రేట్. చాలా కొద్దిమంది హీరోయిన్లకు అలాంటి అదృష్టం దక్కుతుంది. మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ తమిళ్ మార్కెట్ లో పెద్ద హిట్ అయింది. మొదటి భాగంలో త్రిష బాగా హైలెట్ అయింది.

ఇపుడు రెండో భాగం విడుదలకు సిద్ధమైంది. టీం అంతా ఇప్పుడు ప్రమోషన్లు మొదలు పెట్టింది. కార్తీ, విక్రమ్, జయం రవిలతో పాటు శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, త్రిష కూడా ఈ ప్రమోషన్ టూర్లలో పాల్గొంటోంది. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా అందరి దృష్టి మాత్రం త్రిషపైనే.

త్రిషనే అన్ని ఈవెంట్స్ లలో హైలెట్ అవుతోంది. దాంతో, ఈ సినిమా టీం కూడా త్రిషని ప్రతి నగరానికి తిప్పుతోంది. ఐశ్వర్య రాయ్ రెండో భాగంలో కీలక పాత్రలో కనిపిస్తుంది. కానీ, ఆమె ప్రమోషన్స్ కి రావడం లేదు. సో, స్టార్ హీరోయిన్ గా త్రిష పైనే ఫోకస్ పడింది.

ఈ నెల 28న విడుదల కానుంది ‘పొన్నియన్ సెల్వన్ 2’.

 

More

Related Stories