అలాంటోడు దొరికినప్పుడే పెళ్లి!

Trisha

త్రిషకి శింబుతో పెళ్లి కుదిరింది అని జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె స్పందించింది. శింబు ప్రస్తావన ఎక్కడా తీసుకురాకుండా మాట్లాడింది. ఆమెకి ఇప్పుడు 37 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. హాలీవుడ్ హీరోయిన్లు 50కి కూడా చేసుకుంటారు అనుకొండి. జనరల్ గా ఇండియన్ స్టాండర్డ్స్ లో చెపితే ఏజ్ బార్ అయినట్లే.

“నేను పెళ్లి చేసుకోను అని చెప్పలేదు. ఎప్పుడు పెళ్లి జరిగినా అది లవ్ మ్యారేజ్ మాత్రమే. నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి. అతను తగినవాడు అని నాకు అనిపించాలి. ఆలా అయితే, మూడు ముళ్ళు వేయించుకుంటా. అలాంటోడు దొరకనప్పుడు సింగిల్ గానే ఉంటా,” అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇది ఎప్పుడూ చెప్పే మాట. కొత్తగా ఏమి చెప్పలేదు. కాకపోతే సింగిల్ గా ఉండేందుకు కూడా భయపడను అనడమే కొంత కొత్త. త్రిషకి ప్రేమ బంధాలు కొత్త కాదు. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. అందుకే, పెళ్లి చేసుకోకుండా ఉంది ఇన్నాళ్లు. శింబుతో మంచి స్నేహం ఉంది. అందుకే వీరి పెళ్లి గురించి ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. శింబు గురించి అసలు మాట్లాడకుండా తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చింది.

త్రిష ఇటీవల బాగా సన్నబడింది. పాత ఫోటోలని తన సోషల్ మీడియా నుంచి అన్ని డిలీట్ చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఫోటోలను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తోంది.

Related Stories