త్రిష గ్రీన్ ఛాలెంజ్

Trisha

37 ఎళ్ల త్రిష ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం తగ్గించింది. ఇన్స్టాగ్రామ్ నుంచి తన పాత ఫొటోలన్నింటిని తొలగించింది. పూర్తిగా సోషల్ మీడియా డిస్టెన్స్ పాటిస్తోంది. అయినా కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. వెంటనే ఆ ఫోటోలని షేర్ చేసింది.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటింది త్రిష. “ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత. నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను అని మీరు కూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని,” అభిమానులకు పిలుపునిచ్చింది త్రిష.

Related Stories