దీపిక స్థానంలో త్రిష

మునుపటిలా క్రేజ్ లేదు కానీ ఇప్పటికీ త్రిష అడపాదడపా అవకాశాలు పొందుతూనే ఉంది. దీపికా నటించిన ఒక బాలీవుడ్ మూవీని ఇప్పుడు సౌత్ లో త్రిష చేయనుంది అనేది లేటెస్ట్ టాక్. దీపిక, అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన “పీకూ” మూవీని దక్షిణాదిన రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీపికా పాత్రకు త్రిషని తీసుకోవాలని అప్రోచ్ అయ్యారు. ఆమె వెంటనే అంగీకరించింది.

ఐతే, ఈ సినిమాకి దర్శకుడెవరు? నిర్మాత ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఒకవైపు ఆమె పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు, సినిమాల మీడియా సినిమాలు సైన్ చేస్తోంది త్రిష.

కొత్త తరం హీరోయిన్లతో పోటీపడేందుకు ఇటీవలే బరువు కూడా తగ్గింది త్రిష. అందుకే ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి కాబోలు.

More

Related Stories