
39 ఏళ్ల వయసులో మెయిన్ హీరోయిన్ రోల్స్ తో త్రిష బిజీ బిజీగా ఉంది. అదీ కూడా ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. త్రిష ప్రస్తుతం అజర్ బైజాన్ లో ఉంది. అక్కడ షూటింగ్ షురూ చేసింది.
ఆమె తాజాగా అజిత్ సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు అజర్ బైజాన్ లో ప్రారంభం అయింది. “వెకేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేని ఉద్యోగం పొందండి. నేను అదే చేస్తున్నా,” అంటూ ఒక పోస్ట్ పెట్టింది. షూటింగ్ ల కోసమని హీరోలు, హీరోయిన్లు రకరకాల దేశాలకు వెళ్తారు. దేశవిదేశాల చుట్టి వస్తారు పైసా ఖర్చు లేకుండా. త్రిష కూడా అదే ఆనందంలో ఉంది.
ఇటీవలే ఈ భామ విజయ్ సరసన “లియో” అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. విజయ్ తో సినిమా పూర్తి కాగానే అజిత్ తో సినిమా మొదలు కావడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాతి తరంలో అగ్ర హీరోలుగా పేరొందిన తమిళ్ హీరోలు … అజిత్, విజయ్. ఈ ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు త్రిషతో జతకట్టడం విశేషం.
“పొన్నియన్ సెల్వన్” సినిమా విజయంతో త్రిషకి తమిళనాడులో బాగా క్రేజ్ వచ్చింది.