వయసు పెరిగినా గ్లామర్ తరగలేదు


త్రిష వయసు ఇప్పుడు 39 ఏళ్ళు. సీనియర్ హీరోయిన్. 40కి అడుగు దూరంలోకి వచ్చినా ఇంకా హీరోయిన్ పాత్రలే దక్కుతున్నాయి ఆమెకి. ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి వంటి ఒకరిద్దరికి ఈ వయసులో కూడా హీరోయిన్ గా నటించే అదృష్టం దక్కింది.

ఐతే, త్రిష తన అందాన్ని కాపాడుకోవడంలో బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటోంది. ఆమెని తాజాగా ఈ ప్రమోషన్ ఈవెంట్ లలో చూసిన వాళ్ళు తెగ కాంప్లిమెంట్ ఇస్తున్నారట.

సంతూర్ భామలా ఇంకా యంగ్ గానే ఉంది అంటూ పొగిడేస్తున్నారట. నిజానికి ఈ పాత్ర కోసం ఆమెని తీసుకున్నప్పుడు విమర్శలు వచ్చాయి. కొంచెం యంగ్ హీరోయిన్ ని తీసుకోవాల్సింది అన్నారు. కానీ, ఆమె తాజా లుక్ చూసాక అందరి నోళ్లు మూతపడ్డాయి.

త్రిష ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. సినిమాలో కీలకమైన పాత్ర. ఈ సినిమా ప్రచారం కోసం యాక్టివ్ గా పాల్గొంటోంది.

ALSO CHECK: Trisha Krishnan latest clicks

త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఒక వ్యాపారవేత్తతో పెళ్లి అని, ఒక హీరోతో పెళ్లి అని ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి.

 

More

Related Stories