చాన్నాళ్ళకి త్రిష సందడి!

Trisha

సెప్టెంబర్ నెలలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ, ఈ నెలలో పెద్ద సినిమాలు లేవు. అన్నీ, చిన్న, మధ్యస్థాయి సినిమాలే. నెలాఖరులో మాత్రం పాన్ ఇండియా చిత్రం రానుంది. అదే ‘పొన్నియన్ సెల్వన్’. మణిరత్నం తీస్తున్న ఎపిక్ బిగ్ మూవీ ఇది. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో త్రిషది కీలక పాత్ర.

ఐశ్వర్య రాయ్, శోభిత తదితర హీరోయిన్లు ఉన్నారు. కానీ త్రిష పాత్రనే ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అవుతుందట హీరోయిన్ పాత్రల్లో. అందుకే, ఈ నెల అంతా ఆమె సందడే ఉండనుంది. ఇక ప్రమోషన్లలో కూడా పాల్గొనేందుకు ఆమె ఒప్పుకొంది.

త్రిష రేసులో వెనకబడింది. ఒక విధంగా చెప్పాలంటే గత ఐదేళ్ళలో ఆమె నుంచి చెప్పుకోదగ్గ హిట్ మూవీ లేదు. పెళ్లి పుకార్ల విషయంలో తప్ప ఆమె మీడియాలో పెద్దగా హడావిడి లేదు. అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె రాజకీయాల వైపు చూపు వేస్తోందని ఇటీవల ప్రచారం జరిగింది. ఐతే, అది నిజం కాదని తేలింది. ఆమె మళ్ళీ కెరియర్ పై దృష్టి పెడుతోంది. తాజాగా ఆమె కొత్త యాడ్స్ కూడా ఒప్పుకొంది.

మొత్తమ్మీద, చాన్నాళ్లకు త్రిష హంగామా చూడబోతున్నాం.

 

More

Related Stories