మళ్ళీ త్రిష ‘రికార్డులు’

- Advertisement -
Trisha


త్రిష ఒకప్పుడు టాప్ హీరోయిన్. తెలుగులో, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకొంది. సీనియర్ హీరోయిన్ గా మారిన తర్వాత ఆమె తగ్గింది. ఐతే, సడెన్ గా ఇప్పుడు ఆమె లైఫ్ కొత్త టర్న్ తీసుకొంది. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు “రికార్డ్ బ్రేకింగ్” చిత్రాలు అందుకుంటోంది.

మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రం తమిళనాడులో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటించింది. “పొన్నియన్ సెల్వన్”లో నటించిన తర్వాత ఆమెకి మళ్ళీ క్రేజ్ పెరిగింది. అలా ఆమె విజయ్ సరసన “లియో” చిత్రంలో నటించింది.

“లియో” కూడా మొదటివారం భారీ వసూళ్లు అందుకొంది. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా హిట్. ఇక తమిళ్ వర్షన్ కూడా సూపర్ గా ఆడుతోంది తమిళనాడులో. అమెరికాలో ఈ సినిమా 5 మిలియన్ వసూళ్ల దిశగా సాగుతోంది. దాంతో, అమెరికాలో మూడు “5 మిలియన్ల” మూవీ ఉన్న మొదటి తమిళ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేయనుంది ఈ భామ. “పొన్నియన్ సెల్వన్”మొదటి భాగం 6 మిలియన్ల, రెండో భాగం 5 మిలియన్ల వసూళ్లు అందుకున్నాయి. ఇప్పుడు “లియో” కూడా రెండో వారంలో 5 మిలియన్ల మార్క్ అందుకోవచ్చు.

త్రిషకి ఇంకా క్రేజ్ పెరగడం ఖాయం. ఆమెకిప్పుడు 39 ఏళ్ళు.

 

More

Related Stories