త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో యాడ్


త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. మూడూ – ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’. – సూపర్ హిట్టే. త్వరలోనే నాలుగో సినిమా రానుంది అని టాక్.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇంకో సినిమా చేసే అవకాశం ఉంది. ఐతే, ఈ గ్యాప్ లో మాత్రం ఇద్దరూ అనేక యాడ్స్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. దాంతో, బ్రాండ్స్ వచ్చి పడుతున్నాయి. యాడ్స్ తీయడంలో త్రివిక్రమ్ కి మంచి అనుభవం ఉంది. దాంతో, బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే పలు యాడ్స్ వచ్చాయి.

తాజాగా రామోజీ ఫిలిం సిటీలో త్రివిక్రమ్ ఒక ఓటిటి బ్రాండ్ కోసం యాడ్ తీస్తున్నారు. ఈ బ్రాండ్ కి బన్నీ అంబాసిడర్. సో, ఆ యాడ్ షూటింగ్ జరుగుతోంది.

ఇక వచ్చే నెలలో అల్లు అర్జున్ రష్యా వెళ్లనున్నాడు. ‘పుష్ప’ సినిమా రష్యాలో విడుదల కానుంది. అక్కడ ప్రొమోషన్ కోసం రెడీ అవుతున్నాడు.

 

More

Related Stories