తిరుమల దర్శనానికీ ఛార్టర్డ్ ఫ్లైట్

తిరుమల దర్శనానికీ ఛార్టర్డ్ ఫ్లైట్

దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్… బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతికి వెళ్లేందుకు త్రివిక్రమ్ ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ ని బుక్ చేసుకోవడం వీశేషం. కోవిడ్ కారణంగా రెగ్యులర్ ఫ్లైట్ లో వెళ్లేందుకు సెలెబ్రిటీలు జంకుతున్నారు.

తక్కువ దూరమైతే సొంత కారులోనే ప్రయాణం పెట్టుకుంటున్నారు. దూరమైతే… ఇలా స్పెషల్ గా చార్టర్డ్ ఫ్లైట్ లు తీసుకొని వెళ్తున్నారట. బహుశా చార్టర్డ్ ఫ్లైట్ రేట్లు తగ్గాయేమో? అయినా… టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్లు అందరూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఏడాదికి 20 నుంచి 50 కోట్లు వెనకేస్తున్నారు. అందుకే… తిరుపతికైనా, వైజాగ్ కైనా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు.

త్రివిక్రమ్ ఇప్పుడు తన అన్ని సినిమాలకు తమన్ ని రిపీట్ చేస్తున్నాడు.

 

More

Related Stories