ఎన్టీఆర్ ఇంట్లో త్రివిక్రమ్

- Advertisement -
Ntr Trivikramrajamouli

ఎన్టీఆర్ నిన్న రాత్రి తన ఇంట్లో ఒక పార్టీ ఇచ్చారు. ఈ విందుకి రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు శిరీష్, నవీన్, రవి ఇంకా ఇతర సినిమా సెలెబ్రిటీలు అటెండ్ అయ్యారు. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్ ఇండియాకి వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ తన ఇంట్లో విందు నిర్వహించడం జరిగింది.

ఐతే, త్రివిక్రమ్ కూడా రావడం స్పెషల్ అట్రాక్షన్. నిజానికి ఎన్టీఆర్ 30వ సినిమాని త్రివిక్రమ్ తీయాలి. కానీ, కొన్ని అభిప్రాయభేదాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగింది. ఆ స్థానంలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలైంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య పూర్తిగా గ్యాప్ పెరిగిపోయింది అని మాటలు వినపడ్డాయి. మొన్నామధ్య తన సినిమా ప్రారంభోత్సవానికి కూడా త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ పిలవలేదు అని కొన్ని మీడియా సంస్థలు కథనాలు అల్లేశాయి.

కానీ తన ఇంట్లో ఇచ్చిన విందుకి ఇండస్ట్రీ నుంచి అతికొద్దిమందిని ఎన్టీఆర్ పిలిస్తే అందులో త్రివిక్రమ్ కి కూడా చోటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే వారి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. సినిమా చెయ్యడం, చెయ్యకపోవడం అనేది వేరు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి.

భవిష్యత్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు హీరోగా సినిమా తీస్తున్నారు.

More

Related Stories