టాప్ డైరెక్టర్ గా పేరొందిన త్రివిక్రమ్ దూకుడుకి ఇటీవల “గుంటూరు కారం”తో కొంత బ్రేక్ పడింది. ఆ సినిమా కథ, కథనాల విషయంలో త్రివిక్రమ్ విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో, త్రివిక్రమ్ తదుపరి చిత్రం విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముఖ్యంగా “గ్యాసిప్” గ్యాంగ్ ఒకటి చాలా వార్తలు వండి వార్చింది.
“గుంటూరు కారం” రిజల్ట్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని దూరం పెట్టాడని, “పుష్ప 2” తర్వాత త్రివిక్రమ్ తో చేద్దామని అనుకున్న సినిమాని అల్లు అర్జున్ పక్కన పెట్టేశాడని వార్తలు రాసింది ఆ గ్యాంగ్.
కానీ ఆయన ఇవేవి పట్టించుకోకుండా తన తదుపరి చిత్రం కోసం పని మొదలుపెట్టారు. స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ ని కలిసి క్లారిటీ తీసుకుంటారు. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీయాలనుకున్న సినిమా ఆగిపోలేదు. ఐతే, అది ఈ ఏడాది మొదలవుతుందా వచ్చే ఏడాది అన్నది త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తి చేశాకే తెలుస్తుంది.
ఈ సారి త్రివిక్రమ్ తన శైలిని కొంచెం మార్చేస్తారని టాక్. ఆయన తదుపరి చిత్రంలో చాలా మార్పు కనిపిస్తుంది అని టాక్.