ఉలిక్కిపడ్డ త్రివిక్రమ్!

Trivikram


తెలుగుసినిమా పరిశ్రమని తమ కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు దాదాపు ఫలించనట్లే కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరూ కిక్కురుమనటం లేదు. ఒక చిన్న వార్తకు భయపడి ఇటీవల రాజమౌళి టీం ప్రకటన చేసిన తీరు, తాజాగా త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డ వైనం చూస్తే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఇచ్చిన స్ట్రోక్ ప్రభావం మన సెలెబ్రిటీలపై కనిపిస్తోంది.

జగన్ ప్రభుత్వంతో సున్నం పెట్టుకుంటే మనకే నష్టం అని సెలెబ్రిటీలు గ్రహించినట్లు కనిపిస్తోంది.

తాజాగా, త్రివిక్రమ్ పేరుతో రన్ అవుతోన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి వై.ఎస్. జగన్ ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న వచ్చింది. “ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను నియంత్రిస్తోంది. సరే. అలాగే, స్కూల్ ఫీజులు, ఆసుపత్రుల్లో ఫీజులు కూడా అంతటా ఒకే తీరుగా ఉండేలా ప్రభుత్వం చూడగలదా? సినిమాల కన్నా అవి కదా జనాలకు కావాల్సింది.” – ఇది ఆ ట్వీట్ సారాంశం.

ఈ ట్వీట్ ని ఒక జర్నలిస్ట్ మంత్రి పేర్ని నాని వద్ద ప్రస్తావించారు. దానికి అయన సమాధానమిస్తూ ముఖ్యమంత్రి జగన్ కి త్రివిక్రమ్ అభిప్రాయం చేరవేస్తాను అని అన్నారు. అది పత్రికల్లో వచ్చింది. అంతే… త్రివిక్రమ్ టీం కంగారు పడిపోయి ఒక స్టేట్మెంట్ పంపింది.

“త్రివిక్రమ్ సోషల్ మీడియాలో లేరు. ఎవరో ఆయన ఫోటో పెట్టుకొని చేసే ట్వీట్లకు మాకు సంబంధం లేదు. ఆయనకి సంబంధించిన సమాచారం అంతా హారిక హాసిని, ఫార్చూన్ ఫోర్ అనే హ్యాండిల్స్ లో మాత్రమే వస్తాయి. ఇతర కామెంట్స్ ని నమ్మవద్దు,” అంటూ ప్రకటన ఇచ్చారు.

త్రివిక్రమ్ పేరు పెట్టుకొని ఆయన అకౌంట్లు నడిపే వారికి ఎక్స్ క్లూజివ్ గా ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్ ఎలా వస్తున్నాయి? అవి ఎవరు ఇస్తున్నారో మరి. జగన్ ప్రభుత్వం తనని టార్గెట్ చేస్తుందేమో అని త్రివిక్రమ్ లో కంగారు పుట్టిందా?

Advertisement
 

More

Related Stories