సెంటిమెంట్ ని పక్కన పెట్టిన త్రివిక్రమ్

trivikram20years20

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న కొత్త చిత్రానికి అనేక టైటిల్స్ అనుకున్నారు. చివరికి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదే టైటిల్ ని మే 31న అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

ఈ టైటిల్ ఫిక్స్ అయిందని వినిపిస్తున్న మాట ప్రకారం చూస్తే త్రివిక్రమ్ తన కథకు తగ్గ టైటిల్ ని సెలెక్ట్ చేసుకున్నారు తప్ప సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ సినిమా కథ గుంటూరు సమీపంలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరికి మొనగాడులా కనిపిస్తాడు మహేష్ బాబు. అందుకే, ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని త్రివిక్రమ్ అనుకున్నారట.

త్రివిక్రమ్ దర్శకుడిగా తీసిన మొదటి చిత్రం ‘నువ్వే నువ్వే’ కానీ ఆ తర్వాత ‘అతడు’ నుంచి ఎక్కువగా ‘అ’ అనే టైటిల్స్ పై మక్కువ పెంచుకున్నారు. ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమెత’, ‘అల వైకుంఠపురంలో’ … ఇలా సాగుతుంది ఆయన ఫిల్మోగ్రఫీ.

ఐతే, ఆయనే ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘జల్సా’, ‘జులాయి’, ‘ఖలేజా’ వంటి టైటిల్స్ కూడా పెట్టారు. ఐతే, 2015లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలైన తర్వాత ఇప్పటివరకు అన్నీ ‘అ’ టైటిల్స్ పెట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ ని పక్కన పెడుతున్నారన్నమాట.

Advertisement
 

More

Related Stories