త్రివిక్రమ్ టార్గెట్ ఫిక్స్!

Trivikram

త్రివిక్రమ్ కొత్త సినిమా ఇంకా మొదలు కాలేదు. ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్క్షన్ లో మూవీ లో అంటూ గతేడాది ప్రకటన వచ్చింది. కానీ, ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. కాకపొతే, ఇప్పుడు పాటల పని మొదలైంది. హీరోయిన్ గా పూజ హెగ్డే ఫిక్స్. ఇక షూటింగ్ కి వెళ్లడమే మిగిలి ఉంది.

ఏప్రిల్ లో షూటింగ్ మొదలు పెడితే… కనీసం ఏడు, ఎనిమిది నెలల టైం పడుతుంది పూర్తి చెయ్యడానికి. ఎంత స్పీడ్ గా చేసినా… పెద్ద హీరో చిత్రానికి ఏడు నెలల సమయం అవసరమే. సో… సంక్రాంతి 2023కి సినిమాని విడుదల చెయ్యాలనేది టార్గెట్. ఈ టార్గెట్ తోనే త్రివిక్రమ్ ఇక పని మొదలు పెడుతున్నారు.

త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ తో చాలాకాలంగా రెడీగా ఉన్నారు. కానీ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉండి డేట్స్ ఇవ్వలేకపోయారు. తాజాగా ఏప్రిల్ నుంచి సెట్ కి వెళ్లేలా ప్లాన్ చేసుకోమని త్రివిక్రమ్ కి చెప్పారట.

‘అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత ఆయన డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇదే. తాజాగా ఆయన ఫార్చున్ ఫోర్ అనే పేరుతో చిన్న సినిమాల నిర్మాణం కూడా మొదలు పెట్టారు. మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.

 

More

Related Stories