సంపాదనలో పడ్డ త్రివిక్రమ్

- Advertisement -
Trivikram


దర్శకుడు త్రివిక్రమ్ చాలా ఆలస్యంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. లేట్ ఎంట్రీ ఇచ్చినా వరుసగా నిర్మిస్తున్నారు. ఫార్చున్ ఫోర్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి చిన్న సినిమాల్లో సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాత నాగవంశీ తీస్తున్న ఈ మూడు సినిమాల్లో త్రివిక్రమ్ కి వాటా ఉంది.

తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించే ఒక కాన్సెప్ట్ సినిమాలో కూడా త్రివివిక్రమ్ నిర్మాణ భాగస్వామ్యం ఉంది. అయితే, నిర్మాతగా ఆయన భార్య పేరు సౌజన్యని ఉపయోగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ తెరకెక్కనుంది. ఈ సినిమాని సెట్ చేసింది త్రివిక్రమ్. దాంతో, నిర్మాణంలో ఆయనకి పార్ట్నర్ షిప్ దక్కింది.

సుకుమార్ వంటి దర్శకులు నిర్మాతలుగా మారి ఇప్పటికే బాగా వెనకేసుకున్నారు. త్రివిక్రమ్ కొంచెం లెట్ గా మేలుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా సంపాదన మీద పడ్డారనుకోవాలి.

తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఇప్పుడు నిర్మాతగా మరింత సంపాదించనున్నారు.

 

More

Related Stories