మళ్ళీ రైటింగ్ తో త్రివిక్రమ్ బిజీ

trivikram20years9

తెలుగు సినిమా చరిత్రలో గొప్ప రైటర్స్ గా పేరొందిన వారు చాలామంది ఉన్నారు. కానీ, రైటర్ గా ఒక స్టార్డం పొందిన వారు అరుదు. అలాంటి వారిలో త్రివిక్రమ్ ఒకరు. ఒకవిధంగా చెప్పాలంటే డైలాగ్ రైటింగ్ లో త్రివిక్రమ్ చాలా మార్పు తెచ్చారు. ఇప్పుడు దాదాపుగా అందరూ ఆయన పద్దతే ఫాలో అవుతున్నారు. రైటింగ్ నుంచి ఆయన డైరెక్షన్ వైపు వచ్చారు. డైరెక్టర్ గా కూడా ట్రెండ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తెలుగులో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరు.

ఐతే, దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వేరే సినిమాలకు రాసేందుకు ఒప్పుకోలేదు. కేవలం డైరెక్టర్ గానే తన కెరియర్ ని కొనసాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే వేరే సినిమాల స్క్రిప్ లకు సాయం అందించారు.

కానీ త్రివిక్రమ్ ఇప్పుడు దర్శకత్వంతో పాటు వేరే సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చే పని కూడా ఒప్పుకుంటున్నారు. తన కలం బలం ఇతర సినిమాలకు ఉపయెగపడేలా చేస్తున్నారు. రీసెంట్ గా ‘భీమ్లా నాయక్’కి ఆయన తన రచనాశక్తిని ఇచ్చారు. వచ్చేవారం విడుదల కానున్న ‘బ్రో’ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు ఆయనవే.

తాజాగా “హిరణ్యకశ్యప” అనే భారీ చిత్రానికి కథ, మాటలు ఆయనే అందించనున్నారు. రానా ఈ విషయాన్ని ప్రకటించాడు. స్పిరిట్ మీడియా అనే తన ప్రొడక్షన్ కంపెనీ తరఫున నిర్మిస్తున్న వివిధ చిత్రాల వివరాలను రానా అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్’ ఈవెంట్ లో ఆవిష్కరించాడు. “హిరణ్యకశ్యప” సినిమాకి త్రివిక్రమ్ రైటర్ అని ప్రకటించాడు రానా. ఐతే, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా “గుంటూరు కారం” అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అది పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ హీరోగా ఒక భారీ పాన్ ఇండియన్ చిత్రం తీస్తారు. ఈ గ్యాప్ లో ఆయన “బ్రో”, “హిరణ్య కశ్యప” చిత్రాలకు స్క్రిప్ట్ పూర్తి చెయ్యడం విశేషం.

 

More

Related Stories