ఈసారి త్రివిక్రమ్ స్కెచ్ భారీగానే

- Advertisement -
Trivikram and Allu Arjun

త్రివిక్రమ్ పెద్ద దర్శకుడు. మాటల మాంత్రికుడు. ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురంలో’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఆయన. కానీ, ఆయన తెలుగు మార్కెట్ బౌండరీ దాటలేదు. చిన్న సినిమాలు తీసే దర్శకులు కూడా పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తున్న తరుణంలో త్రివిక్రమ్ కొంచెం సంకోచించారు. అందుకే, ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ అటెంప్ట్ చెయ్యలేదు.

ఐతే, ఆయన కూడా ఇప్పుడు మారారు. పాన్ ఇండియా రూట్లోకి వచ్చారు.

ఇప్పటివరకు తీసిన చిత్రాలు ఒక ఎత్తు, ఇది మరో ఎత్తు అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారట. మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ గురి తప్పకూడదు అన్నట్లుగానే ఆయన స్క్రిప్ట్ వర్క్ చేయనున్నారట. ఒక టీం ఆల్రెడీ పని మొదలు పెట్టినట్లు టాక్. ఇప్పటికే కొన్ని ప్యాలెస్ లు కూడా చూసి వచ్చింది ఆ టీం.

త్రివిక్రమ్ ప్రస్తుతం ‘గుంటూరు కారం” సినిమా తీస్తున్నారు. మహేష్ బాబు హీరో. ఇది త్వరగా ఫినిష్ చేసి అల్లు అర్జున్ సినిమాపై ఫోకస్ పెడుతారు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చాయి. ‘గుంటూరు కారం’తో కలిపి వీరి కాంబినేషన్లో మూడు చిత్రాలు.

ఇక అల్లు అర్జున్ తో ఇది నాలుగో చిత్రం. ఇంతకుముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో. అన్నీ హిట్లే. ఇప్పుడు నాలుగోది భారీగా ఉండేలా స్కెచ్చేశారు.

More

Related Stories