త్రివిక్రమ్ ప్లాన్ బాగానే ఉంది కానీ!

Trivikram


దర్శకుడు త్రివిక్రమ్ తీసిన ‘అల వైకుంఠపురంలో’ జనవరి 2020లో విడుదల అయింది. రెండున్నర ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మెగాఫోన్ పడుతున్నారు. మహేష్ బాబుతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం వచ్చే నెల మొదలు కానుంది. సెప్టెంబర్ 8న ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కానీ, ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 28, 2023. సో, ఏడు నెలల్లో మొత్తం షూటింగ్ పూర్తి చెయ్యాలి.

మొదటి షెడ్యూల్ వచ్చేనెల 8 ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి ఏడు నెలల్లో ఫైట్లు, పాటలు, సీన్లు కంప్లీట్ చేసుకుంది పక్కా ప్లాన్ వేసుకున్నారట త్రివిక్రమ్. మొదట ఫైట్స్ తో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ ఇప్పుడు స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసే టెక్నీక్ సంపాదించారు. అందుకే, 7 నెలల్లో గుమ్మడికాయ కొట్టగలను అని ధీమాగా ఉన్నారు.

ఐతే,త్రివిక్రమ్ ప్లాన్ బాగానే ఉన్నా హీరో మహేష్ బాబు టైంకి రావాలి. సినిమా షెడ్యూల్స్ కి ఎటువంటి ఆటంకం కలుగకూడదు. అప్పుడే త్రివిక్రమ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది.

 

More

Related Stories