కరోనా వల్లే ఫంక్షన్ కి దూరం

Trivikram

పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే.. డైరెక్టర్ త్రివిక్రమ్ ఉండాల్సిందే. ఆయన ప్రమేయం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ప్రాజెక్టులు ముందుకు వెళ్లడం కష్టం. ఆ మాటకొస్తే… ‘వకీల్ సాబ్’ పట్టాలెక్కడానికి కారణం త్రివిక్రమ్. ఈ విషయాన్నీ నిర్మాత దిల్ రాజు … వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ కి మాత్రం త్రివిక్రమ్ రాలేదు.

దానికి కారణం… ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతుండడమే. త్రివిక్రమ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. త్రివిక్రమ్ తన కొత్త సినిమా మొదలు పెట్టాలంటే.. ఆయన పూర్తిగా కోలుకోవాలి.

More

Related Stories