7న త్రివిక్రమ్ నుంచి క్లారిటీ

- Advertisement -
Trivikram

మనకున్న అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ కున్న క్రేజ్ వేరు. రైటర్ గా, దర్శకుడిగా ఆయనకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఐతే, త్రివిక్రమ్ కిప్పుడు టైం కలిసి రావడం లేదు. ఆయన సినిమాలపై తరుచుగా రూమర్లు పుడుతున్నాయి. ఇప్పటికే తమ సినిమా ఆగిపోలేదు అని నిర్మాతలు చెప్పినా అభిమానులలో ఎదో ఒక టెన్షన్ ఉంది.

వారి టెన్షన్ మొత్తం తీరేలా త్వరలోనే క్లారిటీ వస్తుంది. త్రివిక్రమ్ పుట్టినరోజు నవంబర్ 7న ఎదో ఒక ప్రకటన చేస్తారు అని అభిమానులు అనుకుంటున్నారు. ఐతే, తన పుట్టిన రోజు నాడు మొదటి లుక్ విడుదల చెయ్యడమో, లేదా ఏదైనా అప్డేట్ ఇవ్వడమో వంటివి త్రివిక్రమ్ ఇంతవరకు చెయ్యలేదు. ఈసారి కూడా అలాంటిది ఏమి ఉండకపోవచ్చు.

కాకపోతే నిర్మాతలు మాత్రం మహేష్ బాబు అభిమానుల కోసం ఈ సినిమా రెండో షెడ్యూల్ గురించి ఒక క్లారిటీ ఇస్తారు.

Also CHECK: 20 Years of Trivikram’s Directing Career

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదలైన మూడో చిత్రం సెప్టెంబర్ లో మొదలైంది. వారం రోజుల మొదటి షెడ్యూల్ తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది. మహేష్ బాబు తల్లి చనిపోవడం, ఆ తర్వాత మానసిక ప్రశాంతత కోసం మహేష్ బాబు లండన్ వెళ్లడంతో అక్టోబర్ లో రెండో షెడ్యూల్ మొదలు కాలేదు. ఇప్పుడు మహేష్ బాబు హైదరాబాద్ కి వచ్చారు. ఈ నెలలోనే షూటింగ్ మళ్ళీ మొదలు కావాలి. కానీ, ఇంకా ఈ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ క్లారిటీ రావొచ్చు. అదే మహేష్ బాబు అభిమానుల కోరిక కూడా.

 

More

Related Stories