త్రివిక్రమ్ ఎమోషనల్ అయిపోయాడు

Trivikram

స్టేజి పైన త్రివిక్రమ్ ఒకరికి పాదాభివందనం చేసిన దాఖలాలు లేవు. అలాంటి అరుదైన సంఘటన నిన్న “రెడ్” సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో జరిగింది. నిర్మాత స్రవంతి రవికిశోర్ కాళ్లను త్రివిక్రమ్ మొక్కారు. రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి ఆయన గెస్ట్ గా వచ్చారు.

“స్వయంవరం సినిమాకి మాటలు రాశాను. అయినా, నాకు అవకాశాలు రాలేదు. భీమవరం వెళ్ళిపోయా. ఆ టైంలో నన్ను పిలిపించి నువ్వే కావాలి సినిమాకి మాటలు రాయించారు. ఆయన బ్యానర్లో నాలుగు సినిమాలకు మాటలు రాశాను. రవికిశోర్ లాంటి వారు బలంగా నిలబడితేనే మంచి సినిమాలు వస్తాయి. కొత్త టాలెంట్ వస్తుంది. రామజోగయ్య శాస్త్రిని పరిచయం చేసింది ఆయనే. స్క్రిప్ట్ మొత్తం చదివి ప్రతి సీన్ గుర్తు పెట్టుకొనే నిర్మాతలు ఇద్దరే. ఇండస్ట్రీలో నేను చూసిన అలాంటి నిర్మాతల్లో ఒకరు రామానాయుడు, మరొకరు రవికిశోర్,” ఇలా త్రివిక్రమ్ ఆయన గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు.

త్రివిక్రమ్ – రామ్ కాంబినేషన్ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. తమ మధ్య కాంబినేషన్లో సినిమా గురించి లాక్డౌన్ లో చర్చకి వచ్చింది అని రామ్ తెలుగుసినిమా.కామ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పలేను అన్నాడు. “కానీ గ్యారెంటీగా ఉంటుంది,” అంటున్నాడు రామ్.

More

Related Stories