త్రివిక్రమ్ భార్య డ్యాన్స్ షో

- Advertisement -
Sowjanya Srinivas

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ సంప్రదాయ నృత్యంలో పేరున్న నర్తకి. ఆమె గతంలో కూడా రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. బహుశా ఆమె స్ఫూర్తితోనే త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో హీరోయిన్ క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సీన్లు పెట్టి ఉంటారు.

సౌజన్య శ్రీనివాస్ తాజాగా “మీనాక్షి కళ్యాణం” పేరుతో ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ శుక్రవారం శిల్పకళా వేదికపై ఆమె ఈ రూపకాని ప్రదర్శిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ఈ రూపకాన్ని చూసేందుకు వస్తున్నారు. ఆయన ముఖ్య అతిథి. త్రివిక్రమ్ ఆత్మీయ అతిథి. ఈ షోని పలు సంస్థలు స్పాన్సర్ చేస్తుండడం విశేషం.

సౌజన్య శ్రీనివాస్ నిర్మాతగా కూడా మారుతున్నారు. త్రివిక్రమ్ ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ తీసే కొత్త సినిమాలకు సౌజన్య శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తారు.

 

More

Related Stories