‘ట్రూ లవర్’ నచ్చుతుంది: SKN

- Advertisement -
SKN

“ట్యాక్సీ వాలా”, “బేబి” వంటి చిత్రాలతో మంచి నిర్మాతగా స్థిరపడ్డారు యువ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన తన మిత్రుడు, డైరెక్టర్ మారుతితో కలిసి “ట్రూ లవర్” అనువాద చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

“ఈ నెల 10న విడుదల అవుతుంది ట్రూ లవర్. ఒక ఫ్రెండ్ ద్వారా ఈ సినిమా మా దృష్టికి వచ్చింది. మారుతి, నేను కలిసి చూశాం. ఇద్దరికీ నచ్చింది. యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఏ రిలేషన్ లోనైనా నమ్మకం ముఖ్యం. “ట్రూ లవర్” సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా ఉన్నాయి,” అని అన్నారు ఎస్ కెఎన్. .

“నేను మారుతి గారితో కలిసి చేసిన ‘ఈ రోజుల్లో’ కూడా యూత్ ఫుల్ మూవీ. కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నేను చేస్తున్న నాలుగు కొత్త సినిమాలు అలాగే ఉంటాయి,” అని చెప్పారు ఎస్ కెఎన్.

చాలా సినిమాలు తీస్తున్నారు ఆయన. ఐతే నిర్మాతగా ఇంకా తాను ఓనమాలు దిద్దుకుంటున్నట్లు చెప్తున్నారు. నిర్మాతగా బాగా చదువుకున్నాక అల్లు అర్జున్ తో మూవీ నిర్మిస్తారట.

 

More

Related Stories