నాని దానికి నో చెప్పాడట

Tuck Jagadish

నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ నెల 23న విడుదల కావాలని ప్లాన్ చేసుకొంది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ సినిమా విడుదల డేట్ ని మార్చేసింది. మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. మరి… ఈ గ్యాప్ లో డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేస్తారా?

ఆ ఆలోచనే చేయొద్దని మేకర్స్ కి ఖరాఖండిగా చెప్పేశాడట. దానికి కారణం ఉంది.. ఈ సినిమాని ఇంటిల్లిపాది థియేటర్లో చూడాలి అనేది నాని కోరిక. గతేడాది “వి” సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశాడు నాని. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేస్తామని టీం చెప్తోంది.

‘టక్ జగదీష్’కి శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ హీరోయిన్. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

More

Related Stories