ఈవారం టాప్-5 సినిమాలివే

Ramesh Varma and Rakshasudu poster

కొత్త సినిమాలు, పెద్ద సినిమాలన్నింటినీ ఛానెళ్ల దాటేశాయి. రాబోయే దసరా, దీపావళి టైమ్ లో ఆ సినిమాల్ని ప్రసారం చేయబోతున్నాయి. దీంతో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ లేకపోవడంతో ఈ వారం (సెప్టెంబర్ 26-అక్టోబర్ 2) రిపీట్ సినిమాలే మరోసారి రాజ్యమేలాయి. అలా రిపీటెడ్ గా టెలికాస్ట్ అయినప్పటికీ “రాక్షకుడు” సినిమా మంచి టీఆర్పీ సాధించడం విశేషం.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన ఈ సినిమాకు 5.80 (అర్బన్) టీఆర్పీ రావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాను ఎన్నోసార్లు ప్రసారం చేసింది జెమినీ టీవీ. అయినప్పటికీ వీకెండ్ ప్రైమ్ టైమ్ లో రీ-టెలికాస్ట్ అయిన ఈ సినిమా బాగానే మెరిసింది.

ఇక టాప్-5 మూవీస్ విషయానికొస్తే.. రెండో స్థానంలో ‘ఊపిరి’ (5.33), మూడో స్థానంలో ‘కేజీఎఫ్-1’ (5.0), నాలుగో స్థానంలో ‘నేల టిక్కెట్’ (4.92), ఐదో స్థానంలో ‘మనోహరుడు’ (4.17) నిలిచాయి.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే బిగ్ బాస్, వంటలక్క చలవతో స్టార్ మా ఛానెల్ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. రెండో స్థానంలో జీ తెలుగు, మూడో స్థానంలో ఈటీవీ, నాలుగో స్థానంలో జెమినీ ఛానెల్ నిలిచాయి.

Top Channels – సెప్టెంబర్ 26-అక్టోబర్ 2

  1. Star Maa
  2. Zee Telugu
  3. ETV
  4. Gemini

News Channels – Total Market: AP+TS
1. TV9 Telugu
2. NTV Telugu
3. TV 5 News
4. Sakshi TV
5. V6 News
6. T News
7. 10 TV

Related Stories