వెంకీ మామకే మళ్ళీ ఓటు

బుల్లితెరపై ఈవారం (ఆగస్ట్ 22-28 వరకు) వరల్డ్ టెలివిజిన్ ప్రీమియర్లు ప్రసారం కాలేదు. డబ్బింగ్ సినిమాలేసి టీఆర్పీ రాబట్టే ప్రయోగాలు కూడా జరగలేదు. దీంతో రిపీట్ సినిమాలే మరోసారి రాజ్యమేలాయి. అలా ప్రసారమైన సినిమాల్లో “వెంకీమామ” బెస్ట్ అనిపించుకుంది.  

ఆదివారం ప్రైమ్ టైమ్ లో జెమినీ ఛానెల్ లో ప్రసారమైన ఈ సినిమాకు 6 టీవీఆర్ వచ్చింది. ఆ వారం ప్రసారమైన సినిమాల్లో అగ్రస్థానం ఈ సినిమాదే. ఈ సినిమా తర్వాత ‘బాహుబలి-2’ (4.15), ‘ప్రతిరోజూ పండగే’ (4.03), ‘సూర్యవంశం’ (3.94), ‘గీతగోవిందం’ (3.65) సినిమాలు నిలిచాయి.

ఇక ఎప్పట్లానే టాప్-10 టీఆర్పీల్లో కార్తికేయ నటించిన ’90ఎంఎల్’, రవితేజ “దరువు” సినిమాలు నిలిచాయి. ఇక సీరియల్స్ లో కార్తీకదీపం హవా కొనసాగుతోంది. టాప్ టీఆర్పీల్లో తొలి 6 స్థానాలు ఈ సీరియల్ వే.

ఇక ఓవరాల్ గా ఎప్పట్లానే స్టార్ మా ఛానెల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. ఊహించని విధంగా ఈటీవీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ వారంలో ఈటీవీలో ప్రసారమైన నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు, జబర్దస్త్ షోలు ఈటీవీకి ఈ ఘనత సాధించి పెట్టాయి. మూడో స్థానంలో జీ తెలుగు, నాలుగో స్థానంలో జెమినీ టీవీ నిలిచాయి.

Related Stories