వరల్డ్ ఫేమస్ లవర్, ఉగ్ర రూపస్య రేటింగ్స్

థియేటర్లలో ఫ్లాప్ అయిన విజయ్ దేవరకొండ, స్మాల్ స్క్రీన్ పై మాత్రం మెరిశాడు. అతడు నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా ఈ వారం (సెప్టెంబర్ 12-18) రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఈ సినిమాకు 5.79 (ఏపీ+తెలంగాణ అర్బన్) రేటింగ్ వచ్చింది.

అయితే రేటింగ్స్ చార్టుల్లో ఈ సినిమాకు అగ్రస్థానం దక్కినప్పటికీ.. విజయ్ దేవరకొండ స్టామినాకు ఈ టీఆర్పీ చాలా తక్కువ. ఎందుకంటే, ఇంతకుముందు అతడు నటించిన “గీతగోవిందం” సినిమాకు అద్భుతమైన రేటింగ్ (20.8-అర్బన్) వచ్చింది. అంతెందుకు థియేటర్లలో ఫ్లాప్ అయిన “డియర్ కామ్రేడ్”, టాక్సీవాలా సినిమాలకు కూడా ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేసినప్పుడు మంచి రేటింగ్స్ వచ్చాయి. వాటితో పోలిస్తే..  “వరల్డ్ ఫేమస్ లవర్” రేటింగ్ తక్కువే.

“వరల్డ్ ఫేమస్ లవర్” తో పాటు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమా కూడా ప్రసారమైంది. ఈటీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 5.05 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. 
ఈ రెండు సినిమాలతో పాటు “రంగస్థలం”, “గోవిందుడు అందరివాడేలే”, “నరసింహా” సినిమాలు టాప్-5లో నిలిచాయి

Related Stories