
పెళ్లి చేసుకున్న మూడు నెలలకే నయనతారకి పిల్లల భాగ్యం కలిగింది. ఆమె తల్లి అయింది. అదీ కూడా ఇద్దరు కవలలకు.
సరోగసీ ద్వారా ఆమె, ఆమె భర్త విగ్నేష్ శివన్ ఇద్దరు అబ్బాయిలకు తల్లితండ్రులయ్యారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అటు కంగ్రాచ్యులేషన్స్ తో పాటు ట్రోలింగ్ కూడా మొదలైంది వాళ్ళకి.
మరోవైపు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా చారి అప్పుడే చెప్పాడంటూ ‘అదుర్స్’ వీడియోని షేర్ చేస్తున్నారు. ‘అదుర్స్’ సినిమాలో ఎన్టీఆర్, నయనతార జంటగా నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. అందులో ఒక పాత్ర పౌరోహిత్యం చేసే చారి. ఆ చారి పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అయింది.
ALSO READ: Nayanthara and Vignesh blessed with twins
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు నయనతార దూకగానే, చారి కూడా దూకేస్తాడు. ఆమె చనిపోవడానికి దూకింది అని భావించి ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆమె నడుము మీద మచ్చ చూసి మచ్చ శాస్త్రం ప్రకారం మీకు కవలలు పుడతారు అని చెప్తాడు చారి. ఈ సీను ఇప్పుడు వైరల్ అయింది. అప్పుడే చారి చెప్పాడు నయనతారకి కవలలు అని అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు ఈ క్లిప్ ని.
ఈ కింది వీడియోలో 5 నిమిషాల 35 సెకండ్ల నుంచి ఆ సీన్ ని చూడొచ్చు.