- Advertisement -

ఈ మధ్య తెలుగు సినిమా పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాటలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు సాయి పల్లవి చేరింది. ఆమె నటించే పాటలు కూడా స్పీడ్ గా మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందుతాయని ప్రూవ్ అవుతోంది. మూడేళ్ళ క్రితం “ఫిదా” సినిమాలో “వచ్చిండే” పాట… ఇప్పుడు “సారంగ దరియా”.
కేవలం 14 రోజుల్లోనే “సారంగ దరియా” (“లవ్ స్టోరీ” మూవీ) 50 మిలియన్ల వ్యూస్ అందుకొంది. తక్కువ రోజుల్లో 50 మిలియన్ల పొందిన సౌత్ ఇండియన్ సినిమాల పాటల్లో రెండూ కూడా సాయి పల్లవి ఖాతాలోనే ఉండడం విశేషం.
- రౌడీ బేబీ (మారి 2) – 8 రోజులు
- సారంగ దరియా (లవ్ స్టోరీ) -14 రోజులు
- బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) – 18 రోజులు
- వాతి కమింగ్ (మాస్టర్) – 21 రోజులు
- రాములో రాములా (అల వైకుంఠపురంలో) – 27 రోజులు
ఈ పాటలు అన్ని వైరల్ కావడానికి మెయిన్ రీజన్ ట్యూన్, పాడిన విధానం. సాయి పల్లవి విషయంలో ఈ రెండు విషయాలతో పాటు ఆమె డ్యాన్స్ అదనపు ఆకర్షణ. అందుకే, ఆమె పాటలు అంత ఫాస్ట్ గా అన్ని వ్యూస్ పొందాయి.