ఆ రెండు ఫైట్లు హైలైట్

- Advertisement -
RRR

రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్” సినిమా ఒక యాక్షన్ డ్రామా. సినిమాలో రొమాంటిక్ సీన్లకి చోటులేదు. యుగళ గీతాల్లేవు. మరి అంతా ఫైట్లేనా?

“ఈ సినిమాలో ఎమోషన్ ప్రధానం. ఫైట్ సన్నివేశాల్లోనూ ఎమోషన్ ఉంటుంది. సినిమా మొత్తం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉంటారు. వారి స్నేహం, వారి లక్ష్యం ఈ కథకి బలం,” అని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక రామ్ చరణ్ ఇంట్రడిక్షన్, ఎన్టీఆర్ ఇంట్రడిక్షన్ తో పాటు రెండు ఫైట్స్ ఈ సినిమాకి హైలెట్ అవుతాయి అనే మాట వినిపిస్తోంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సినిమా మొత్తానికే ఆకర్షణ. ఛత్రపతి కానీ, మగధీర కానీ, బాహుబలి కానీ… రాజమౌళి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందట. ఆ క్లిప్ ఒకటి ట్రైలర్ లో కూడా చూపించారు రాజమౌళి.

ఇక 20 నిముషాలు సాగే క్లయిమాక్స్ అందరికి సంతృప్తి కలిగిస్తుందట. ఈ రెండు పెద్ద ఫైట్స్ చాలు పైసా వసూల్ కావడానికి అని చెప్తున్నారు. ఈ మాటలో నిజమెంత అనేది వెండితెరపై చూడాలి.

More

Related Stories