ఇద్దరు రెడీ, మిగతావాళ్ల సంగతేంటి?

Akhil Akkineni

సంక్రాంతికి మేం వస్తామంటే మేం అని రెండు నెలల క్రితం నలుగురు ఐదుగురు హీరోలు హడావిడి చేశారు. కానీ, తీరా పొంగల్ టైం దగ్గర పడేసరికి కొందరు జారుకున్నారు. కొందరు ఇప్పుడు రెడీ అంటున్నారు. సంక్రాంతి బరిలో మా సినిమా వస్తుంది అని తాజాగా రవితేజ, రామ్ కన్ఫర్మ్ చేశారు. మరి మిగతా హీరోల సంగతేంటి?

అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, రానా నటించిన “అరణ్య”, నితిన్ మూవీ “రంగ్ దే” సినిమాలు ఇంతకుముందు పొంగల్ మూవీస్ గా ప్రకటించుకున్నాయి. కానీ ఈ మూడు సినిమాలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి.

ఇప్పటివరకు, రామ్ నటించిన “రెడ్”, రవితేజ మూవీ “క్రాక్” మాత్రం సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్నాయి అని చెప్పాలి. తమిళ్ డబ్బింగ్ నుంచి విజయ్ “మాస్టర్” వస్తుంది.

కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా సినిమాలన్నీ సమ్మర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి.

More

Related Stories