సంక్రాంతికి పెద్దోళ్ల వారసులు

- Advertisement -
Ashish and Ashok Galla

తెలుగు చిత్రసీమలో నిర్మాతల, దర్శకుల కొడుకులు హీరోలుగా పరిచయం అయి స్టార్ డం తెచ్చుకున్నవారున్నారు. అదే కోవలో తెలుగుసినిమా రంగంలో అగ్ర నిర్మాతగా వెలుగొందుతోన్న దిల్ రాజు కుటుంబం నుంచి స్టార్ కిడ్ పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా అడుగుపెడుతున్న చిత్రం… రౌడీ బాయ్స్.

అనుపమ పరమేశ్వరన్ అందచందం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆశిష్ ని హీరోగా పరిచయం చెయ్యాలని దిల్ రాజు రెండు, మూడేళ్ళుగా చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. జనవరి 14న థియేటర్లో విడుదల అవుతోంది ‘రౌడీ బాయ్స్’.

సంక్రాంతికి పరిచయం అవుతోన్న మరో హీరో… అశోక్ గల్లా. హీరో మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడే అశోక్ గల్లా. ‘హీరో’ అనే పేరుతో రూపొందిన మూవీలో నటించాడు ఈ కుర్ర హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టే నిధి అగర్వాల్ ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్.

రెండు పెద్ద కుటుంబాల నుంచి పరిచయం అవుతున్న ఇద్దరు యువ హీరోల చిత్రాలు ఈ సంక్రాంతి బరిలో నిలిచాయి.

 

More

Related Stories