రెండేళ్ల లాంగ్ గ్యాప్ ఎందుకు?

Sarkaru Vaari Paata

మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ 2020 సంక్రాంతికి విడుదలైంది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదిపాటు ఇంటిపట్టునే ఉన్నాడు మహేష్. ఏడాది తర్వాత కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. అదే.. ‘సర్కారు వారి పాట’.

స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది ఆగస్టులోనే ‘సర్కారు వారి పాట’ రిలీజ్ చేస్తాడనుకుంటే, ఏకంగా ఆ మూవీని ఏడాది తర్వాత తీసుకొస్తున్నాడు. 2022 సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ‘సర్కారు వారి పాట’ విడుదలకి మధ్య గ్యాప్ రెండేళ్లు. 45 ఏళ్ల ఈ సూపర్ స్టార్ ఇంత స్లో గా సినిమాలు చెయ్యడం ఫ్యాన్స్ కి నచ్చట్లేదు.

‘సర్కారు వారి పాట’ వచ్చే జనవరిలో విడుదలైతే, అప్పటికి రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉంటారు. అంటే, మహేష్ బాబు రాజమౌళి సినిమాని వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఈ లోపు, మహేష్ మరో మూవీ చేసేందుకు ఛాన్స్ దక్కదు. రాజమౌళి సినిమా పూర్తి అయి, విడుదలయ్యేసరికి మరో రెండేళ్లు హుష్ కాకి.

మహేష్ బాబు స్పీడ్ గా సినిమాలు చేస్తాడనుకుంటే గ్యాపులు ఎక్కువ తీసుకుంటున్నాడు ఏంటి అని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

More

Related Stories