సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరో

పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవ్వరూ కెరీర్ వదులుకోరు. కేవలం అవకాశాలు లేనప్పుడు మాత్రమే తప్పుకుంటారు. అది కూడా చాలా సైలెంట్ గా. ఇలాంటి విషయాలు పైకి ఎవ్వరూ చెప్పుకోరు. కానీ హీరో ఉదయనిధి స్టాలిన్ మాత్రం సినిమాల నుంచి తప్పుకున్నాడు. తన రిటైర్మెంట్ ను తనే స్వయంగా ప్రకటించాడు.

అవును.. తను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశాడు ఉదయనిధి స్టాలిన్. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు రాజకీయంగా కూడా బిజీగా ఉన్నాడు. దీంతో అతడికి అస్సలు టైమ్ సరిపోవడం లేదు. దేనికీ టైమ్ కేటాయించలేకపోతున్నాడు. సినిమా, రాజకీయంలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశాడు. దీంతో ఉదయనిధి రాజకీయాల్నే ఎంచుకున్నాడు. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు.

ఉదయనిధి నటించిన ఓ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది. బాలీవుడ్ లో హిట్టయిన ఆర్టికల్-15కి రీమేక్ అది. ఆ సినిమా ప్రచారంలో భాగంగానే తన రిటైర్మెంట్ మేటర్ బయటపెట్టాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ హీరో, మామన్నన్ అనే సినిమా చేస్తున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా, ఫహాజ్ ఫాజిల్ విలన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమానే తన కెరీర్ కు చివరి చిత్రం అవుతుందని ఉదయనిధి ప్రకటించాడు.

ఉదయనిధి తండ్రి స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉదయనిధి కూడా ఎమ్మెల్యేగా తమిళనాట అసెంబ్లీలో కొనసాగుతున్నారు. ఇలాంటి టైమ్ లో పూర్తిస్థాయిలో రాజకీయాలకే టైమ్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాడు ఉదయనిధి.

 

More

Related Stories