ట్రెండింగ్‌లో ‘బిగినింగ్‌’ ట్రైలర్‌

- Advertisement -

మనిషి జీవితానికి ఆది అంతం… చావు పుటకలే. ఈ రెండింటి ప్రాధాన్యతను నేచర్‌ నేపథ్యంగా చెప్పనున్న కథే – ‘బిగినింగ్‌’. ముదునూరు రాజ్‌ దర్శకుడిగా, జోషిరామ్‌, సృష్టి జైన్‌ జోడీగా డిఎన్‌ఏ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న చిత్రమిది. చేతన్‌ శర్మ ప్రమోద్‌ కుమూర్‌, ఆయుషి రావత్‌, ఆర్యన్‌ ప్రీత్‌లాంటి కొత్త కాస్టింగ్‌తో రూపొందిన సినిమా అఫీషియల్‌ టైలర్‌ సోమవారం విడుదలైంది. హర్షితా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, గుడివాడ స్టూడియోస్‌ భాగస్వామ్య నిర్మాతలు.

.

దర్శకుడు రాజ్‌ మాట్లాడుతూ “నేచర్‌ నేపథ్యంగా సాగే కథ కోసం చాలా కష్టపడ్డాం. ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబం కథ చెప్పడం కోసం… హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లోని నేచర్‌కి దగ్గరగా వెళ్లాం. మేం చూపించే నేచర్‌తో టాలీవుడ్‌కు సరికొత్త లొకేషన్లు రుచి చూపించబోతున్నట్టే. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యముంది. వాటిపై ఆసక్తి పెంచేందుకే -టైలర్‌లో పాత్రలను చూపించకుండా సీక్రెసీ మెయిన్‌టెన్‌ చేశా. సినిమా దాదాపుగా పూర్తెంది. త్వరలోనే విడదలకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నాడు.

జర్మనీలో సెటిలైన కవిశంకర్‌ సంగీతం సమకూర్చిన చిత్రానికి ఢిల్లీ బేస్‌డ్‌ కెమెరామెన్‌ నౌషద్‌ అలీ పనితనం ‘బిగినింగ్‌’కు మరింత హైలెట్‌ కావడం ఖాయం. త్వరలో పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి.

More

Related Stories