మహేష్ గురించి ఇలాంటి న్యూసా? అస్సలు ఊహించి ఉండరు

మహేష్ గురించి ఇలాంటి న్యూసా? అస్సలు ఊహించి ఉండరు

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియనిదవ్వరికి? సూపర్ ఫిట్‌గా ఉంటారు. యాభై పదుల వయసులోకి చేరువవుతున్నా.. కాలేజ్ కుర్రాడు అంటే నమ్మేస్తారు. అంత స్లిమ్‌గా ఫిట్‌గా కనిపిస్తాడు. క్రమశిక్షణతో కూడిన జీవితం.. డైలీ వర్కవుట్స్, మరీ ముఖ్యంగా ఆహార నియమాలు వీటన్నింటికీ కారణమని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మరి ఇలాంటి వ్యక్తికి అనారోగ్యం అంటూ న్యూస్. 

మహేష్ గతంలో తీవ్రమైన మైగ్రేన్ వ్యాధితో బాధపడేవారట. ఆ సమయంలో మహేష్ చాలా బాధపడేవారట. ఎంత మంది వైద్యులను సంప్రదించినా ఫలితమైతే దక్కలేదట. ఏదైనా తాత్కాలిక పరిష్కారం మినహా శాశ్వత పరిష్కారం లభించేది కాదట. ఈ క్రమంలోనే ఆయన భార్య నమ్రత కల్పించుకుని ఓ వైద్యురాలి వద్దకు ఆయనను తీసుకెళ్లారట. ఆమె మహేష్‌కి అల్లోపతి ద్వారా బాడీలోని నరాలను రిలీజ్ చేసి మైగ్రేన్‌ని తొలగించారట. 

ఇవీ చదవండి: టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

Mahesh Babu, Namrata Shirodkar

తన మైగ్రేన్ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఆయనపై ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయనకు మోకాలి శస్త్ర చికిత్స జరిగిందంటూ ప్రచారం జరిగింది. తాజాగా మహేష్ అమెరికా వెళ్లారంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంకేముంది? మహేష్‌కి అనారోగ్య సమస్య వచ్చింది కాబట్టి ట్రీట్‌మెంట్ కోసమే యూఎస్ వెళ్లారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది.

 

More

Related Stories