‘మాస్టర్’కి కేంద్రం షొక్

Master

“మాస్టర్” సినిమా కోసం తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. “తమిళనాడులో 100 శాతం టికెట్లు అమ్ముకునేలా థియేటర్లకు అనుమతి” ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదు అని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే విజయ్ నటించిన “మాస్టర్” సినిమా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ మీదే రన్ చెయ్యాలి.

తనని పెద్ద హీరో విజయ్ పర్సనల్ గా కలిసి రిక్వెస్ట్ చెయ్యడంతో తమిళనాడు ముఖ్యమంత్రి EPS పళనిస్వామి కోవిడ్ నిబంధనలను సడలించారు. 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచుకునేందుకు ఒప్పుకున్నారు. ఐతే, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయ విపక్షాలు కూడా తప్పుపట్టాయి. దాంతో, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కలగచేసుకుంది.

Also Check: Malavika Mohanan at Master promotions

దేశంలో ఏ రాష్ట్రము కూడా 100 శాతానికి అంగీకరించలేదు. కరోనా కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో 100 శాతం ఆక్యుపెన్సీకి ఒప్పుకోవడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని బలి పెట్టడమే.

ఒక రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టిప్లెక్స్ లకు సంబందించిన నిర్ణయాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంటాయి. ఐతే, కోవిడ్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కొన్ని నిబంధనలు విధించింది. ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు మార్చడానికి వీల్లేదు. అందుకే, కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం సడలించిన నిబంధనలను తోసిపుచ్చింది.

విజయ్ నటించిన “మాస్టర్” ఈ నెల 13న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

More

Related Stories