- Advertisement -

రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే ఒక బిడ్డకు తల్లితండ్రులు కాబోతున్నారు. ఉపాసన బేబీ షవర్ సంబరాలు ఇటీవల దుబాయ్ లో జరిగాయి. ఆమె తన భర్త రామ్ చరణ్‌తో కలిసి దుబాయ్‌లో బేబీ షవర్ వేడుక జరుపుకున్నారు. వారి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఈ వేడుకలో చరణ్, ఉపాసన జంట చూడ ముచ్చటగా కనిపించారు. ఉపాసన ఆమె సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని నిర్వహించారు.
ఈ వేడుకలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ జంట.
హైదరాబాద్ లోని అపోలో డాక్టర్ల బృందం ఉపాసన డెలివరీకి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది.