‘అత్తమ్మ కిచెన్’ మొదలెట్టిన ఉపాసన

Upasana and Surekha

అత్తాకోడళ్ల అనుబంధానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఉపాసన. ఆమె తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా “అత్తమ్మ కిచెన్” పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టారు.

ఈ రోజు సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనేక ప్రదేశాలు తిరుగుతుండేవారు. షూటింగ్ టైంలో కూడా రుచికరమైన భోజనం తినేలా సురేఖ సిద్ధం చేస్తుండేవారట . ఆ రెసిపీలను “అత్తమ్మ కిచెన్” పేరుతో అందరికీ పంచాలని ఉపాసన భావించారు. ఇంటి భోజనం మిస్ అవుతున్న వారికి ఈ ‘అత్తమ్మ కిచెన్’ ఉత్పత్తులు చక్కగా ఉపయోగపడుతాయి.

“అత్తమ్మ కిచెన్” ప్రొడక్ట్స్‌ కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలను ప్రతిబింబిస్తాయి.

Advertisement
 

More

Related Stories