చరణ్ కూతురికి ట్విన్ కజిన్స్

Upasana and Ram Charan

రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనకి ఇటీవలే కూతురు పుట్టింది. ఆ పాపకి క్లీంకార అని నామకరణం చేశారు. లేక లేక కలిగిన కూతురు కావడంతో ఉపాసన నిత్యం ఎదో ఒక పోస్ట్ తన కూతురు గురించి షేర్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా తన కూతురుకి ఇద్దరు చెల్లెళ్ళు పుట్టారు అని ఆమె ఒక ఫోటో పోస్ట్ చేశారు.

ఉపాసన సోదరికి ఆ మధ్య పెళ్లి అయింది. ఆమె ఇప్పుడు తల్లి అయింది. ఆమెకి కవలలు పుట్టారు. దాంతో, తన సోదరి అన్షుపాల పిల్లల ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోని ఉపాసన షేర్ చేశారు. తన కూతురుకి మరో ఇద్దరు సిస్టర్స్ వచ్చారు అంటూ ఆమె రాసుకొచ్చారు.

రామ్ చరణ్ ఇంట్లో ఇప్పటివరకు అందరూ ఆడపిల్లలు పుట్టడం విశేషం. రామ్ చరణ్ కి కూతురు, రామ్ చరణ్ సోదరీమణులకు కూడా ఆడపిల్లలే పుట్టారు. మొత్తంగా మెగాస్టార్ ఇంట్లో ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఉపాసన సోదరికి కూడా ఒకేసారి ఇద్దరు కూతుళ్లు పుట్టడం విశేషం.

రామ్ చరణ్, ఉపాసన ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నారు. కూతురు పుట్టాక వారి ఇంట్లోకి సంబరం వచ్చింది. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత పుట్టడం ఒక కారణం ఐతే చాలా కాలం పాటు అభిమానులు, సమాజంలోని కొందరు తనకు పిల్లలు పుట్టడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు అని ఆ మధ్య ఉపాసన వాపోయింది. అందుకే, తల్లి కావడంతో ఆమె గొప్ప ఆనందంగా ఉన్నారని చెప్పొచ్చు.

Advertisement
 

More

Related Stories