ఇంకోసారి తల్లినవుతా: ఉపాసన

- Advertisement -
Ram Charan and Upasana

రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన మరోసారి తల్లి అవ్వాలనుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. “రెండో రౌండ్ కి సిద్ధంగా ఉన్నానేమో,” అంటూ ఆమె ట్వీట్ చేసింది.

రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారు తల్లితండ్రులయ్యే భాగ్యం కలిగింది. గతేడాది ఉపాసన కూతురుకి జన్మనిచ్చింది. క్లిన్ కార కొణిదెల (Klin Kaara Konidela) అనే పేరుని పెట్టారు ఆ పాపకు.

మొదటి కూతురు మొదటి బర్త్ డే సమీపిస్తుండడంతో ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్ కి ఆమె సిద్ధం అవుతున్నట్లు ఉంది.

స్త్రీల ఆరోగ్యం గురించి అపోలో సంస్థ నిర్వహించిన ఒక ఈవెంట్ లో ఉపాసన ఇలా మాట్లాడింది. తల్లి ఎప్పుడు కావాలి అనేది ఆడవాళ్ళ ఇష్టంగా ఉండాలి. వాళ్ళ ప్రాధాన్యాలను ఇంకొకరు నిర్ణయించొద్దు అని ఆమె అన్నారు. “నేను చాలా ఆలస్యంగా తల్లి అయ్యాను. అది నా వ్యక్తిగత ఛాయిస్. బహుశా నేను రెండోసారి తల్లి అవడానికి కూడా రెడీగా ఉన్నానేమో,” అని ఆమె చెప్పింది.

 

More

Related Stories