- Advertisement -

రామ్ చరణ్ ఎల్లుండి (మార్చి 27న) తన పుట్టిన రోజును జరుపుకుంటాడు. బర్త్ డే వీక్ కాబట్టి ఆయన భార్య ఉపాసన వారి పాత ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో బాగా వైరల్ అయింది. పెళ్ళికి ముందు తీసుకున్న ఫొటోలా కనిపిస్తోంది.
“సంతోషంగా ఉండేవాళ్ళు తమ జీవితాల్లోకి సంతోషాన్ని మాత్రమే తీసుకొస్తారు అనే మాటని నమ్ముతాను,” అంటూ ఉపాసన తన భర్తతో కలిసి బైక్ దగ్గర నిల్చున్న ఫోటోని షేర్ చేసింది. ఉపాసన, రామ్ చరణ్ పెళ్ళికి ముందు కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. 2012లో వీరి పెళ్లి జరిగింది.
రామ్ చరణ్ ఈ శనివారం 37వ బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకుంటాడు.