అన్నీ “పెద్ద” సినిమాలే!

- Advertisement -
Kushi

ఒకప్పుడు సినిమాలు మూడు గంటల నిడివి ఉండేవి. ఆ తర్వాత రెండున్నర గంటలకు అటు ఇటుగా కామన్ పద్దతి అయింది. రీసెంట్ గా రెండున్నర గంటలంటే అంత పెద్ద సినిమానా అని జనం నిట్టూరుస్తున్నారు. ఇలాంటి టైంలో కొందరు దర్శకులు మాత్రం మూడు గంటల నిడివి ఉంచుతున్నారు. దర్శకుడు సందీప్ వంగా “అర్జున్ రెడ్డి”కి అలా చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత రాజమౌళి, ప్రశాంత్ నీల్ కూడా రెండు గంటల 50 నిమిషాల వరకు తమ సినిమాల లెంగ్త్ ఉంచడం మొదలుపెట్టారు.

త్వరలో విడుదల కానున్న కొన్ని సినిమాలు కూడా ఇదే విధంగా లెంగ్త్ విషయంలో తగ్గేదే లే అంటున్నాయి.

ఖుషి… 165 నిముషాలు (2 గంటల 45 నిమిషాలు)
జవాన్ .. 170 నిముషాలు (2 గంటల 50 నిమిషాలు)
సలార్ … 180 నిమిషాలు (3 గంటలు)

మరి ఈ సినిమాల ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటే ఇక అందరూ “పెద్ద” సినిమాలే తీస్తారు.

 

More

Related Stories