గనితో ఉపేంద్ర షూటింగ్

గనితో ఉపేంద్ర షూటింగ్


కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగులో అనేక సినిమాల్లో నటించాడు. ఆయనకి మన దగ్గర మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ‘గని’ సినిమాలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న స్పోర్ట్స్ డ్రామా…గని. ఈ సినిమాలో కీలక పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారు. ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

మన తెలుగు స్టార్స్ ఇప్పుడు కీలకమైన పాత్రలకు విజయ్ సేతుపతి, ఉపేంద్ర వంటి మంచి ఇమేజ్ ఉన్న పరభాషా హీరోలను తీసుకుంటున్నారు. బడ్జెట్ కొంత పెరిగినా సినిమాకి ఒక బజ్, క్రేజ్ వస్తుంది అనేది ఆలోచన. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కొంత ఇబ్బందిలో పండింది. జులై 30న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తే,,. ఆ డేట్ కి ‘రాధేశ్యామ్’ వచ్చి పడింది. ఇప్పుడు కొత్త డేట్ ని ఫిక్స్ చెయ్యాలి.

‘గని’లో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

More

Related Stories