అమెరికాలో ‘ఉప్పెన’ లేదు!

Uppena

‘ఉప్పెన’ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కొత్త హీరోహీరోయిన్లు, కొత్త దర్శకుడితో రూపొందిన ఈ సినిమాకి అనూహ్యమైన ఓపెనింగ్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఐతే, ‘ఉప్పెన’ అమెరికా మార్కెట్లో పెద్దగా సాధించింది ఏమి లేదు. కొవిడ్ కారణంగా అమెరికాలో సినిమాలకు జనం రావడం లేదనేది వాస్తవం. అక్కడి మార్కెట్ ఇంకా కోలుకోలేదు. సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’, విజయ్ నటించిన ‘మాస్టర్’ వసూళ్లు కూడా చాలా తక్కువ.

ఐతే, ‘ఉప్పెన’ మొదటి వీకెండ్ డీసెంట్ అమౌంట్ పొందింది. కానీ సోమవారం, మంగళవారం మరి 10 డాలర్లు, 5 డాలర్లు రాబట్టడమే ఘోరం.

టెక్సాస్ రాష్ట్రంలో మంచు తుపానుతో జనం విలవిలాడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కరెంట్ లేదు. జనం బయటికి వచ్చే పరిస్థితి లేదు. దాంతో కీలకమైన ఈ మార్కెట్ లో ‘ఉప్పెన’కి జనం ఒక్కరూ కూడా రాకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇతర నగరాల్లో అలాంటి పరిస్థితి లేదు. మరి అక్కడ కూడా జనం రాలేదంటే…. ‘ఉప్పెన’ ఎన్నారైలను ఆకర్శించలేదని అనుకోవాలా? లేదూ అక్కడి తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు ఇంకా ఆసక్తి చూపడం లేదు అని భావించాలా?

కారణం ఏదైనా మరి 5, 10 డాలర్ల వసూళ్లు రావడం అంటే… ఏమనాలి?

Advertisement
 

More

Related Stories