50 కోట్లకు చేరువలో ఉప్పెన

Uppena

‘ఉప్పెన’ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సుకుమార్ అన్నాడు. ఆయన అన్నట్లుగానే సినిమా కళ్ళు చెదిరే హిట్ అయింది. జనం పల్స్ సుకుమార్ పట్టేసినట్లే. ఆయన అన్నట్లుగానే సినిమా ఇప్పటికే 44 కోట్లు (తెలుగు రాష్ట్రాల్లో షేర్) కలెక్ట్ చేసింది. దాదాపుగా 70 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తం క్లోజ్ అయ్యేనాటికి 100 కోట్ల గ్రాస్ రావొచ్చు.

రెండు వారాల పాటు ఈ సినిమా ఊపేసింది అనే చెప్పాలి. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా రన్ బాగానే ఉంటుంది. నితిన్ నటించిన ‘చెక్’, అల్లరి నరేష్ ‘నాంది’ మినహా మిగతావేవీ దానికి పోటీ కావు. ఈ సినిమాలో నటించిన హీరో వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాడు. హీరోయిన్ కృతి శెట్టి పెద్ద హీరోయిన్ గా మారుతోంది. దర్శకుడు బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రి బ్యానర్లోనే తీస్తాడు. పెద్ద రేంజున్న హీరోనే సెట్ చెయ్యాలని మైత్రి సంస్థ ప్రయత్నిస్తోంది.

లవ్ స్టోరీ చిత్రాలకు ‘ఉప్పెన’ ఊపిరినిచ్చింది. అలాగే, ఇప్పుడు మ్యూజిక్ అనేది ఒక సినిమా సక్సెస్ కి ఎంత ఇంపార్టెంట్ గా మారిందో మరోసారి ప్రూవ్ చేసింది ఉప్పెన.

More

Related Stories