ఫస్ట్ వీకెండ్ కే లాభాల్లోకి ఉప్పెన!

‘ఉప్పెన’ సినిమా మూడు రోజుల్లోనే మొత్తం పెట్టిన పెట్టుబడిని లాగేస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు దాదాపు 9 కోట్ల షేర్ అందుకొంది. రెండో రోజు మరో 7 కోట్లు లాగిందట. ఆదివారం కలెక్షన్లను కలుపుకుంటే… మూడు రోజుల్లోనే ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కలిపి 20 కోట్లకు పైగా షేర్ ని రాబడుతుంది. అంటే, తెలంగాణలో ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వస్తుంది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొన్ని జిల్లాల్లో లాభాల్లోకి వచ్చినట్లే. మరికొన్ని జిల్లాల్లో మరో రెండు రోజుల్లో లాభాలు వస్తాయి అని అంటున్నారు. ఓవరాల్ గా, ప్రస్తుత ట్రెండ్ ని బట్టి ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ కి మంచి ఊపును తెచ్చిపెట్టింది.

యూత్ ని టార్గెట్ చేసిన ప్రేమకథ ఇది. పాటలు, కొత్త జంట కెమిస్ట్రీ ఈ సినిమాకి ఈ రేంజు కలెక్షన్లు వచ్చేందుకు కారణం. ఫైనల్ గా ఎంతవరకు లాగుతుంది అనేది చూడాలి. ఐతే, ఇటు తెలుగు సినిమా బాక్సాఫీస్ కి ‘ఉప్పెన’ ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ని తెచ్చింది. ఎందుకంటే, కోవిడ్ 19 తర్వాత 100 శాతం అక్యూపెన్సీతో నడిచిన మొదటి మూవీ ఇది.

అలాగే, కొవిడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఊపు ఇచ్చేందుకు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దాంతో ఇటీవల అన్ని సినిమాలు హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో మల్టిప్లెక్స్ లో 200 రూపాయలతో నడుస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ లలో కూడా రేట్లు పెంచారు.

సో, చిన్న సినిమాలకు కూడా గతంతో పోల్చితే మంచి ఓపెనింగ్ వస్తే ఎక్కువ కలెక్షన్ కనపడుతోంది.

Advertisement
 

More

Related Stories